తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 9వ తేదీన ఒకే వేదిక పైన ప్రసంగించనున్నారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. ఈనెల 9వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఓ మీడియా సంస్థ సదస్సులో పాల్గొనబోతున్నారు.

ఇద్దరూ సీఎంలు కలిసి వివిధ అంశాల పైన చర్చించనున్నారు. సామాజిక న్యాయం, తెలంగాణ ప్రభుత్వం సర్వే పైన రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఎడ్యుకేషనల్ హబ్స్, క్వాంటమ్ వ్యాలీ, సుపరి పాలన, సంకీర్ణ రాజకీయాలు మొదలగు అంశాలపైన సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. వీరిద్దరూ కలిసి ఒకే వేదిక పైన మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ సదస్సు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.