సినిమా రంగంపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మిత చిత్రాలపై 100 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటన చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా సినీ పరిశ్రమను పరిరక్షించడమే లక్ష్యమని, ఇది జాతీయ భద్రతాంశమని వ్యాఖ్యనించారు. ఈ చర్యతో అమెరికాలో తెలుగు చిత్రాల విడుదల ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

టికెట్ ధరలు పెరగడంతో.. ప్రేక్షకులపై ఆర్థిక భారం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాల ఆందోళన చెందుతున్నారు. తెలుగు చిత్రాలకు యూఎస్ విడుదల కష్టసాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
- సినిమా రంగంపై డొనాల్డ్ ట్రంప్ పిడుగు
- విదేశాల్లో నిర్మిత చిత్రాలపై 100 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటన
- అమెరికా సినీ పరిశ్రమను పరిరక్షించడమే లక్ష్యమని, ఇది జాతీయ భద్రతాంశమని వ్యాఖ్య
- ఈ చర్యతో అమెరికాలో తెలుగు చిత్రాల విడుదల ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం
- టికెట్ ధరలు పెరగడంతో.. ప్రేక్షకులపై ఆర్థిక భారం మరింత పెరిగే ఛాన్స్
బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాల ఆందోళన
- తెలుగు చిత్రాలకు యూఎస్ విడుదల కష్టసాధ్యమవుతుందని అంచనా