అసెంబ్లీ సాక్షిగా ప్రతీ రూపాయి బహిర్గతం చేశాం : మంత్రి పొంగులేటి

-

పాలేరు గ్రామంలో సూర్యాపేట-అశ్వారావుపేట 15 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సత్య దూరమైన ఆరోపణలు చేస్తోందని, వాటిని ప్రజలు విశ్వసించరని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఖజానా గురించి గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రతి ఒక్క రూపాయికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వివరించారని తెలిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో గూండా ఇజం ప్రదర్శించి, ఎదురు దాడి చేసి తప్పును, ఒప్పుగా, ఒప్పును తప్పుగా చూపించే ప్రయత్నం చేసిందని ఆ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మరని ఆయన విమర్శించారు.

ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 నెలలు గడిచిన అసెంబ్లీ కి రాడని, 5 సంవత్సరానికి ఒకసారి వారికి గుర్తు వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పోతారని అది ప్రజలు
పట్టించుకోరని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న సంక్షేమం, అభివృద్ధికి
నిధులు కేటాయించి ముందుకు వెళుతుందని అన్నారు. మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామని
అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news