రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు… అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనే దానిపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దానిపై కూపీ లాగుతున్నారు తెలంగాణా పోలీసులు. ఈ నేపధ్యంలోనే కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్తి వివాధంతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రణయ్ హత్యకు ముందే మారుతి రావు తన తమ్ముడి పేరిట తన ఆస్తిని మొత్తాన్ని రాసారని, అందుకు వీలునామా రాసి కూడా ఇటీవల మళ్ళీ తిరగరాసారని పోలీసులు గుర్తించారు. అది ఎందుకు తిరగారాయాల్సి వచ్చింది అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
కూతురి తో గత కొన్ని రోజులుగా సయోధ్యకు ప్రయత్నం చేస్తున్నాడని, అయితే కూతురు అందుకు అంగీకరించలేదని గుర్తించారు. తనను ఈ కేసు నుంచి బయటపడేయాలని కొందరితో ఆయన సంప్రదింపులు కూడా జరిపారట. అయితే తమ్ముడి తో ఉన్న ఆస్తి వివాదాలే దీనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి తనకు తన అన్నకు మాటలు లేవని ఆయన సోదరుడు చెప్తున్నారు.
తన పేరు మీదు వీలునామా రాస్తే వద్దని మార్పించా అని కూడా చెప్తున్నారు. దీనితో అసలు ఎం జరిగింది అనే విషయమై పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కూతురు ఈ కేసు విషయంలో వెనక్కు తగ్గితే ఆస్తి మొత్తం రాసి ఇస్తా అని కూడా ఆయన హామీ ఇచ్చారని అంటున్నారు. అయితే కేసు తుది దశకు చేరుకోవడం తోనే ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.