ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. ఉత్తర భారతంలో 27 ఎయిర్ పోర్టులు మూసివేత

-

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ ఎటువంటి చర్యలు దిగుతుందో అని భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఉగ్రవాదుల మరణాలకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని అటు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు మసూద్ అజహర్ పేరిట నిన్న ఓ లేఖ విడులైంది.ఈ క్రమంలోనే నిఘా వర్గాల సమాచారం మేరకు ఉత్తర భారతంలో 27 ఎయిర్ పోర్టులను కేంద్రం మూసివేసింది. అలాగే.. 430 విమానాలను రద్దు చేసింది.

ఈ ఆంక్షలు మే 10 ఉదయం 5 గంటల 29 వరకూ కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకూ పౌరులు విమాన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. పాకిస్థాన్ గగన తలం నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది.మరోవైపు పాక్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్ తో పాటే యూపీలోనూ హై అలర్ట్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news