భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

-

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వ్యతిరేక ప్రచారంపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏదైనా అత్యవసర పరిస్థితి సమయంలో వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. జమ్ముకశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు,సిక్కిం ప్రభుత్వ ప్రతినిధితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న సమావేశమైన విషయం తెలిసిందే.

వర్చువల్ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడుతూ.. భారత్‌ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దవని రాష్ట్రాలను ఆదేశించారు. దేశ వ్యతిరేక ప్రచారంపై నిఘా ఉంచాలని ఆదేశించింది. నకిలీ కథనాలను ప్రచారం చేసే ఖాతాలను బ్లాక్‌ చేయాలని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దేశ వ్యతిరేక ప్రచారంపై కఠినంగా నిఘా ఉంచాలని అధికారులను కోరారు. తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర సంస్థ సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news