జీవితంలో ఆరోగ్య పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండవు, ముఖ్యంగా వివాహం తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. దీనివలన ఆరోగ్యం పరిస్థితులు కూడా మారతాయి. నిపుణుల ప్రకారం, వివాహం అయిన తర్వాత డిమెన్షియా సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వివాహం తరువాత ఇటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు. డిమెన్షియా అంటే చిత్త వైకల్యం. ఈ సమస్య ఎదురైనప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్య రావడానికి కేవలం పెళ్లి మాత్రమే కారణం కాకుండా, ఇతర కారణాలు కూడా ప్రభావితం చేయవచ్చు.
పెళ్లి తరువాత ఎన్నో మార్పులు జరుగుతాయి పైగా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలంటే ఎంతో సమయం పడుతుంది. అలాంటప్పుడు ఎక్కువ ఆలోచనలు మరియు ఒత్తిడి పెరుగుతాయి. అలాంటి సందర్భాలలో డిమెన్షియా వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ మానసిక సమస్యతో బాధపడితే మెదడు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా, జీవనశైలిలో మార్పులు చేసుకొని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇటువంటి వ్యాధులు ఎదురవడం వలన ఒత్తిడి మరింత పెరుగుతుంది. పెళ్లి తర్వాత భాగస్వాముల మధ్య సమస్యలు ఎదురైనప్పుడు, మానసిక ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది.
కనుక మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలంటే, మీకు నచ్చిన పనులను చేయడానికి కొంత సమయాన్ని కేటాయించాలి. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, దీని ద్వారా డిమెన్షియా వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వివాహం తర్వాత మహిళలు వారి వ్యక్తిగత ఇష్టాలపై శ్రద్ధ పెట్టకుండా, ఎన్నో త్యాగాలను చేస్తారు. దీని వల్ల వారు మానసికంగా కృంగిపోతారు. పైగా ఎంత కష్టపడినా సరే ఎలాంటి గుర్తింపు దక్కదన్న భావన వారిలో పెరుగుతుంది. దీని ప్రభావం మెదడుపై తీవ్రమవుతుంది. కనుక, వివాహం తర్వాత కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా, భాగస్వాముల మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించడం ద్వారా డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు.