జమ్ముకాశ్మీరో పాక్ దాడులు కొనసాగుతున్న తరుణంలో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను కాపాడాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశారు. పాక్ దాడుల్లో ఇప్పటికే సామాన్య పౌరులు తీవ్రంగా గాయపడగా.. వారి ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే, జమ్మూకశ్మీర్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు.ఈ క్రమంలోనే శనివారం ఉదయం తమను కాపాడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు వారు లేఖ రాశారు.
కశ్మీర్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తమను తరలించాలని లేఖలో విద్యార్థులు కేంద్రమంత్రిని కోరారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ యూనివర్సిటీ అధికారులు, స్థానిక కలెక్టర్‌తో మాట్లాడారు. కాగా, కేంద్ర మంత్రి ఆదేశాలతో తెలంగాణకు చెందిన 23 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంతో ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ చేసిన విషయం తెలిసిందే.