మెట్లకు బదులుగా లిఫ్ట్ ను ఉపయోగిస్తున్నారా? అయితే పొరపాటు చేస్తున్నట్లే..!

-

ప్రతి ఒక్కరి జీవితంలో ఫిట్నెస్ ఎంతో అవసరం. ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా రోజు వ్యాయామాలను చేస్తూ ఉండాలి. చాలా శాతం మంది సమయం సరిపోడం లేదని భావించి వ్యాయామాలను చేయడం మానేస్తారు. దాని వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే సమయం లేనప్పుడు చిన్న చిన్న వ్యాయామాలను ప్రారంభించాలి. ప్రతిరోజు 30 నిమిషాలు పాటు వ్యాయామాలకి సమయాన్ని కేటాయించడం వలన ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు మరియు ఎంతో ఫీట్‌గా కూడా ఉండవచ్చు. ఎప్పుడైతే నడవడం, మెట్లు ఎక్కడం, స్ట్రెచింగ్ వంటివి చేస్తారో శారీరక వ్యాయామాలు అలవాటుగా మారతాయి. దీంతో మరింత సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు.


ముందుగా వారంలో ఐదు రోజులు పాటు రోజుకు 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయిస్తారో, ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుక ప్రతిరోజు 30 నిమిషాలు మెట్లు ఎక్కడానికి కేటాయించవచ్చు. ఇలా చేయడం వలన బరువు తగ్గుతారు అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ముందుగా ప్రారంభించే సమయంలో తక్కువ మెట్లతో ప్రారంభించాలి. దాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి. ఇలా చేయడం వలన క్యాలరీలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇంట్లో లేదా ఆఫీసులో లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం వంటివి చేయాలి.

ఇలా చేయడం వలన కూడా ఎంతో ఫలితం ఉంటుంది. అయితే 30 నిమిషాల పాటు మెట్లు ఎక్కడానికి సమయాన్ని కేటాయిస్తే ఇది ఒక కార్డియో వర్కౌట్ లా పనిచేస్తుంది. దీంతో శారీరక వ్యాయామాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది. మెట్లు ఎక్కడం వలన క్యాలరీలు కరగడంతో పాటు, కండరాలు బలంగా మారతాయి. దీంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయం చేస్తుంది. ప్రతిరోజు మెట్లు ఎక్కడం వలన శారీరకంగా మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా సహాయం చేస్తుంది. ప్రతిరోజు కనీసం రెండు లేక మూడు ఫ్లోర్లు మెట్లు ఎక్కడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news