ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు పాటించిన సరే ఎన్నో కీటకాలు, పురుగులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉంటాయి. కాకపోతే బల్లులు ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ఎన్ని చిట్కాలను పాటించినా, వాటిని తరిమడం కష్టమవుతుంది. అటువంటి సమయంలో ఈ చిట్కాలను పాటిస్తే, ఎంతో త్వరగా బల్లులను ఇంటి నుండి తరిమేయొచ్చు. ఇంట్లో గుడ్డు పెంకులను పెట్టడం వలన, బల్లులు భయపడతాయి. ముఖ్యంగా ఇంటి మూలాల్లో మరియు బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో గుడ్డు పెంకులను పెట్టడం వలన వాటి వాసనకు భయపడి బల్లులు ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి.
అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి ముక్కలను కూడా ఇంట్లో పెట్టడం వలన బల్లులు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. కనుక వెల్లుల్లి లేక ఉల్లి ముక్కలను కిటికీ దగ్గర, తలుపు దగ్గర పెట్టడం వలన, వాటి వాసనకు బల్లులు దూరం అవుతాయి. ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు, కారం పొడిని నీటిలో కలిపి స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేయడం వలన బల్లులు మాయమవుతాయి. అదేవిధంగా నీటిలో యూకలిప్టస్ ఆయిల్ లేక పుదీనా ఆయిల్ ను స్ప్రే చేయడం వలన ఇంటి నుండి బల్లులు తొలగిపోతాయి.
నెమళ్లు బల్లులను తింటాయి. అందువలన ఇంట్లో నెమలి ఈకలను పెట్టడం వలన బల్లులకు భయం కలుగుతుంది. ఈ విధంగా బల్లులు ఇంటి నుండి తొలగిపోతాయి. నిమ్మకాయ లేక కమల పండు తొక్కల వాసనకు బల్లులు దూరం అవుతాయి. కనుక ఈ తొక్కలను బల్లులు ఉండేటువంటి ప్రదేశాలలో పెట్టడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కిటికీలు, తలుపులు అంచులు మరియు గోడల రంధ్రాలను మూసేయడం వలన బల్లులు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా చీకటి మూలల్లో బల్లులు ఎక్కువగా ఉంటాయి. కనుక అటువంటి ప్రదేశాలను శుభ్రంగా ఉంచి ఈ చిట్కాలను పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.