ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిధున్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు ఐంది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. గతంలో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది సుప్రీంకోర్టు. అప్పటికి మధ్యం కేసులో మిధున్ రెడ్డిని నిందితుడుగా చేర్చకపోవడం, అరెస్ట్ చేసే ఉద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో మిథున్ రెడ్డి పిటిషన్ కొట్టేసింది హై కోర్టు.

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు మిధున్ రెడ్డి. మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపారు జస్టిస్ పార్థివాలా ధర్మాసనం. ప్రస్తుతం మిధున్ రెడ్డిని నిందితునిగా చేర్చిన విషయాన్ని సుప్రీంకోర్టు కు చెప్పింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మెరిట్స్ ఆధారంగా మళ్లీ తాజాగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది జస్టిస్ పార్థివాలా ధర్మాసనం.