AP: మహిళ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య !

-

ఏపీలో కలకలం. ఫీల్డ్ అసిస్టెంట్ అవమానించాడని కరువు పనికి వెళ్లిన మహిళ టీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంది. తన మృతికి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ కారణమంటూ.. కమ్మ పుట్టుక పుట్టిన నన్ను ఒసేయ్ అంటూ అందరి ముందు అవమానిస్తాడా అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని మాధురి ఆత్మహత్య చేసుకుంది.

అయితే తాజాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతల పాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి (35) గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లగా.. పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజతో వాగ్వాదం జరిగింది.

అందరి ముందు తనను అమర్యాదగా మాట్లాడుతూ మీదకు రావటాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని, అవమానంగా ఉందని కన్నీటి పర్యంతమై అవమానాన్ని తట్టుకోలేక చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన చావును టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీరియస్‌గా తీసుకుని భవిష్యత్లో మహిళలను కించపరి చేలా మాట్లాడాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మహిళ.

Read more RELATED
Recommended to you

Latest news