హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్ లు సిద్ధం అయింది. రూ.19 వేల కోట్ల అంచనాలతో డీపీఆర్ లు సిద్ధం అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్ట్ గా చేపట్టేలా డీపీఆర్ సిద్ధం చేశారు. మూడు మార్గాల్లో 86.5 కి. మీ మేర ప్రతిపాదనలు చేశారు. జేబీఎస్-మేడ్చల్, జేబీఎస్-శామీర్ పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్- ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం చేపట్టనున్నారు.

డీపీఆర్ లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదనలు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో రహదారి, సెకండ్ ఫ్లోర్ లో మెట్రో ప్రతిపాదనకు గతంలో HAML విముఖత కలుగనుంది. తాజా ప్రతిపాదనలో డబుల్ డెక్ లేకుండా హకీంపేట్ రన్వే నుంచి ఎలైన్మెంట్ చేయనుంది, సీఎం ప్రణాళికకు అనుగుణంగా డీపీఆర్ ఏర్పాటు చేశారు.