ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ పొలిట్‌బ్యూరో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రెండు నెలల్లో ఫ్రీ బస్సు కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే జూన్ 12 నుంచి కొత్తగా లక్ష వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

2014-19 మధ్య నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని, కడపలో మహానాడు నిర్వహిస్తామని పేర్కొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అటు టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా అందించనుంది. టీడీపీ కార్యకర్తలు చనిపోతే వీలైనంత త్వరగా బీమా అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.