తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో యజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చాలా ప్రైవేట్ కళాశాలలో మూతపడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజు రీయంబర్మెంటును బకాయిలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.