అమెరికాలో అరవింద హంగామా

-

యంగ్ టైగర్ వీర రాఘవ రెడ్డిగా వీరత్వం చూపించేందుకు వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఈరోజు రిలీజైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. యూఎస్ లో 225 లొకేషన్స్ లో రిలీజ్ అయిన అరవింద సమేత ప్రీమియర్స్ తోనే 7,97,366 డాలర్స్ వసూళు చేసిందని తెలుస్తుంది. మరికొన్ని స్క్రీన్స్ కలక్షన్స్ కూడా కలుపుకుని 800000 డాలర్స్ కచ్చితంగా క్రాస్ అయ్యే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన అరవింద సమేత కొద్దిపాటి ఎంటర్టైన్మెంట్ మిస్స్ అయ్యింది అన్న ఒక్క లోపం తప్ప మిగతా సినిమా అంతా అదరగొట్టేశాడు త్రివిక్రం. దసరాకు వచ్చిన ఎన్.టి.ఆర్ మరోసారి తాను దసరా బుల్లోడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఓవర్సీస్ కలక్షన్స్ ఈ రేంజ్ లో ఉంటే తెలుగు రెండు రాష్ట్రాల్లో అరవింద సమేత ఎలాంటి వసూళ్ల బీభత్సం సృష్టించిందో అంచనా వేయొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాల కలక్షన్స్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news