హంపీ తెలుసు కదా. కర్ణాటకలో ఉంది. హంపీలో ఫేమస్ ఏంటిది అని అడిగితే అంతా టక్కున చెప్పే సమాధానం హంపీ రథం. దాన్నే రాతి రథం అని కూడా అంటారు. ఎందుకంటే అది రాయితో చేయబడింది. అయితే.. అచ్చం హంపీ రాతి రథంలా ఉండే బంగారు రథాన్ని ఓ స్వర్ణకారుడు తయారు చేశాడు. కర్ణాటకలోని కర్వార్ అనే ప్రాంతానికి చెందిన ఉమాకాంత్ అనే వ్యక్తి బంగారు హంపీ రథాన్ని చేశాడు. అయితే.. ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని కేవలం 12 గ్రాములతోనే తయారు చేశాడు. ఎంతో లైట్ వెయిట్ తో అచ్చం హంపీలోని రాతి రథంలా దాన్ని తీర్చిదిద్దడంతో అది అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ బంగారు రథం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.