హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు కేటీఆర్. ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో భేటీ కానున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఉద్యోగుల సమస్యలు, నీటి పారుదల అంశాలపై చర్చ జరుగనుంది. నిన్న హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేటీఆర్ దాదాపు రెండు గంటల పాటు చర్చలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై హరీష్ రావుతో చర్చించారు కేటీఆర్. అయితే ఇవాళ మరోసారి కూడా హైదరాబాద్లోని హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం జరిగింది.

ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు కేటీఆర్ వెళ్లినట్లు చెబుతున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా నిన్న అర్ధరాత్రి అమెరికాకు కల్వకుంట్ల కవిత వెళ్లడం జరిగింది. తన కుమారుడి విద్యాభ్యాసం నేపథ్యంలో అమెరికాకు కల్వకుంట్ల కవిత వెళ్లింది. ఆమె అమెరికాకు వెళ్లిన నేపథ్యంలో… హరీష్ రావు అలాగే కేటీఆర్ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.