2024లో బీజేపీతో కలిసి వెళ్లకుండా పెద్ద తప్పు చేశాం – వైసీపీ మాజీ MLA

-

జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024 లో బీజేపీతో కలిసి వెళ్లకుండా పెద్ద తప్పు చేశామన్నారు. 2019-24 వరకు కేంద్రం తెచ్చిన ప్రతి బిల్లుకు లోకసభలో, రాజ్యసభలో మనం మద్దతు ఇచ్చాం.. వాళ్లతో కలిసి వెళ్తే తప్పేంటి? అని నిలదీశారు.

Former MLA Prasanna Kumar Reddy
Former MLA Prasanna Kumar Reddy

ఇదే విషయాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా కు చంద్రబాబు మీద నమ్మకం లేదని పేర్కొన్నారు. అటు ఏపీ లిక్కర్ స్కాం లో ధనుజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం పై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. . జగన్ మంచితనం వల్లనే మేము సంకనాకి పోయామని బాంబు పేల్చారు. 2019-24 మధ్యలో జగన్ ఒక డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదన్నారు.. చంద్రబాబు నాయుడు ఏమో ఆ డిస్టలరీలు మొత్తం వైస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టాలవి అన్నట్టు మాట్లాడుతున్నాడని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news