PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

-

ఇస్రో ఇవాళ ప్రయోగించిన PSLV-C61 ప్రయోగంలో చిన్న సమస్య వచ్చింది. ఈ మేరకు ఇస్రో చైర్మన్‌ ప్రకటన చేశారు. PSLV-C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య వచ్చిందని పేర్కొన్నారు ఇస్రో చైర్మన్‌. మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య తెలెత్తిందన్నారు.

ISRO
Technical problem in PSLV-C61 launch

మిషన్‌ అసంపూర్తిగా ముగిసింది… ఈ సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు ప్రకటిస్తామన్నారు ఇస్రో చైర్మన్‌. ఇక అంతకు ముందు శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకెళ్లిందని వార్తలు వచ్చాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన EOS-9 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి మోసుకెళ్లింది. కాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు ఇది 101వ ప్రయోగం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news