కొండా సురేఖ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. సొంత పార్టీ నాయకులపై కొండా సురేఖ కుట్రలు పన్నుతున్నారని వార్తలు వస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఒక వర్గం ఏర్పాటు చేస్తున్నారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్ పై అత్యాచార కేసు పెట్టించి కొండా దంపతులు అరెస్టు చేపించినట్లు సమాచారం అందుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఇంటికి దళిత మహిళను పంపించి, అత్యాచారం చేశాడంటూ అక్రమ కేసు నమోదు చేసి కొండా దంపతులు అరెస్టు చేపించినట్లు వార్తలు వస్తున్నాయి.

కొండా దంపతులు వారి అనుచరులు చేసే అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు, కాంగ్రెస్ పథకాలను అర్హత లేని వారికి కట్టబెడుతున్నారని నిలదీసినందుకు తనపై కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టారని ఆరోపించారట గుండేటి నరేందర్. ఆదివారం ఉదయం దళిత నాయకురాలిని తన ఇంటికి పంపించి, అన్యాయంగా ఆమెతో నాపైన కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారట నరేందర్. మిల్స్ కాలనీ పోలీసులు కూడా కొండా దంపతుల చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు.