ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరిగిన కేసీఆర్ కిట్ తరహాలోనే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కిట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో… ప్రసవించిన తల్లులకు అందించే ఎన్టీఆర్ బేబీకిట్ల పథకాన్ని… పునః ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది.

ఇందుకోసం 51.14 కోట్లు విడుదల చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 1400 10 రూపాయల ఖర్చుతో అందించే ఈ కిట్ లో దోమల నెట్టుతో కూడిన… ఇతర సామాన్లు ఉంటాయి. దోమల నెట్ తో పాటు బేబీ బెడ్, పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్ అలాగే బాడీ ఆయిల్, రెండు టవల్స్, రెండు డ్రెస్సులు, ఆరు వాచబుల్ నఫీస్, చిన్న బొమ్మలు… బేబీ షాంపూ లాంటివి ఉంటాయి. వీటిని త్వరలోనే అధికారికంగా ప్రకటించి రిలీజ్ చేస్తారు.