ఏపీలో కొత్త జిల్లా… సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని 2024 ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇక ఆ హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం పడ్డట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చ కూడా జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన పైన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై కూడా కీలక చర్చ జరిగిందట.

ఈ నేపథ్యంలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశాలకు కూడా ఇచ్చారట సీఎం చంద్రబాబు నాయుడు. మార్కాపురం ను ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని అటు డిమాండ్ కూడా మొదటి నుంచి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మండల కేంద్రమే కాకుండా రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతోంది. మరి ఎప్పటి వరకు మార్కాపురం ప్రజల కల నెరవేరుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news