రెండున్నరేళ్ల కొడుకుతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓ తల్లి. బంగారు ఆభరణాలు పోవడంతో మనస్తాపం చెంది.. రెండున్నరేళ్ల కొడుకుతో బిల్డింగ్ పైనుంచి దూకేసింది తల్లి. హైదరాబాద్-చింతల్‌కుంట పరిధిలో ఈ ఘటన జరిగింది. సుధేష్ణ(28) అనే మహిళ ఈ నెల 16న బంధువుల శుభకార్యానికి వెళ్లగా.. అక్కడ తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీ అయింది.
అవి దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది సుధేష్ణ. ఈ క్రమంలో తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్‌తో పాటు మూడో అంతస్తు నుంచి దూకింది సుధేష్ణ. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుధేష్ణ మృతి చెందారు. అటు స్వల్పగాయాలతో బయటపడిన బాబు.. క్షేమంగా ఉన్నారు. ఇక రెండున్నరేళ్ల కొడుకుతో బిల్డింగ్ పైనుంచి దూకిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.