మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. తాజాగా 20 మంది మావోలు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. 20 మంది మావోలు మృతి చెందారు.

ఈ రోజు నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టుల పొలిట్‌బ్యూరో సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. మావోయిస్టులను మట్టుపెట్టేందుకు… కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి… వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులకు అడ్డగా మారిన చత్తీస్గడ్ వేదికగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.