తెలంగాణ ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఇలాంటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతాయని అధికారులు ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్ష కొనసాగుతుంది.

ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక విద్యార్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు అరగంట ముందుగానే చేరుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సప్లమెంటరీ పరీక్షలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక జూన్ మూడో తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి.