ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.3,32,671 కోట్లు అప్పు చేసిందన్నారు జగన్. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టిన 12 నెలల కాలంలోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు. వైసీపీ చేసిన అప్పులో.. ఒక్క ఏడాదిలోనే 41 శాతం అప్పు టీడీపీ ప్రభుత్వం చేసిందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్.

కేసీఆర్ గారు 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో రూ.616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారన్నారు. చంద్రబాబు నాయుడు 53 లక్షల స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి ? ఎందుకు అంత భూమి ? అన్నారు వైఎస్ జగన్. అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచామన్నారు జగన్.
ఆనాడు ఖరారైన టెండర్ల విలువ రూ.41,170 కోట్లు చేసినట్లు వెల్లడించారు. చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందని తెలిపారు. కానీ, ఆ టెండర్లను రద్దు చేశారన్నారు. మిగిలిన ఆ పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.