నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి, డీకే శివ కుమార్ ఇద్దరి పైన సంచలన విషయాలు బయటపెట్టింది ఈడీ. సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఛార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.

రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను ఛార్జ్ షీట్‌లో చేర్చింది ఈడీ. ఈ తరుణంలోనే యాంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థ కోసం రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ బోగస్ డొనేషన్స్ సేకరించారని తెలిపింది ఈడీ. డీకే శివకుమార్ తన వ్యక్తిగత అకౌంట్ నుండి 25 లక్షలు, తన ట్రస్ట్ నుండి 2 కోట్లు యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు డొనేట్ చేసినట్టు పేర్కొంది ఈడీ.