భారత జనతా పార్టీ ఎంపీ డీకే అరుణకు కేంద్రం కీలక బాధ్యతలు దక్కాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ తెలంగాణ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణని నియమించారు. అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ.. ప్రకటన విడుదల చేసింది.
ఇక అటు కవిత లెటర్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ కామెంట్స్ చేశారు. అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటి? ఎప్పుడంటే అప్పుడే తండ్రిని కలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కవితను కేసీఆర్ కలవట్లేదా? అసలా లేఖ రాయడానికి గల ఉద్దేశం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
నిన్నటి నుండి లేఖ చక్కర్లు కొడుతున్నా ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పందన లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ కూడా కావొచ్చు… లెటర్ కేసీఆర్ వరకు చేరిందా? మధ్యలోనే బయటకు వచ్చిందా అనేది కూడా తెలియాలని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ.