తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం

-

తిరుమలలో మద్యం మత్తులో కానిస్టేబుళ్ల వీరంగం సృష్టించారు. ఫుల్లుగా మద్యం సేవించి డివైడర్ ను ఢీకొని, రోడ్డుపై మూత్ర విసర్జన చేశారు ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు. విధులు నిర్వహించేందుకు తిరుమలకు వచ్చి, తమ అధికారికి చెందిన వాహనాన్ని తీసుకొని, ఫుల్లుగా మద్యం సేవించి అలిపిరి చెక్ పాయింట్ దాటుకొని తిరుమల కొండపైకి వెళ్లారు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్, షేక్ సిరాజుద్దీన్. డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఉన్న సచివాలయం ముందు డివైడర్ ను ఢీకొనడంతో పగిలిన జీపు టైర్, దీంతో వాహనం దిగి రోడ్డుపై దొర్లుతూ, మూత్ర విసర్జన చేసి హల్ చల్ చేశారు కానిస్టేబుళ్లు.

Constables in Tirumala go on a rampage under the influence of alcohol
Constables in Tirumala go on a rampage under the influence of alcohol

విషయం తెలుసి ఘటనా స్థలానికి చేరుకొని కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయగా ఒక్కొక్కరికి దాదాపు 300 పాయింట్లకు పైగా నమోదైందని తెలిపారు పోలీసులు. తిరుమలలో తమకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిని భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇలాంటి వారి వల్ల పోలీస్ శాఖకు చెడ్డ పేరు వస్తుందని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు పోలీసు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news