Bomb scare in Vijayawada: విజయవాడ నగర వాసులకు బిగ్ అలర్ట్. విజయవాడలో బాంబు కలకలం రేపింది. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన విజయవాడ పోలీసులు… రంగంలోకి దిగారు. బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేస్తున్నారు బాంబు స్క్వాడ్స్ అధికారులు.

షాపులను క్లోజ్ చేయించిన పోలీసులు… క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానితులను చెక్ చేస్తున్నారు అధికారులు. అలాగే ఫోన్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.