కవితమ్మా.. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరే కదా?: ఎంపీ చామల

-

కవితమ్మా.. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు మీరే కదా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చురకలు అంటించారు. దెయ్యాలు ఉన్నాయని నువ్వు చెప్పిన మాట వాస్తవమైతే సీబీఐ విచారణ జరిపించు.. అప్పుడే నువ్వు చేసే ఆరోపణలు నిజం అని తేలుతుందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

chamala kiran 
chamala kiran  on kavitha

ఇక అటు కేసిఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలని ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత, కేటీఆర్ మధ్య వైరం కోసం హరీష్ రావు ఎదురు చూస్తున్నారని.. ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నారని ఆగ్రహించారు. సొంత చెల్లి ఏకు మేకు కావడం తో కవిత ఎపిసోడ్ డైవర్ట్ చేయడానికి సీఎం రేవంత్ పై కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు… పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాలను కవిత ఎత్తి చూపారని వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి… బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతోందని విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news