ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదు అయింది. ఇప్పటికే రెండు కేసులు నమోదు అయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మూడవ కేసు కూడా నమోదు అయినట్లు ప్రకటన విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలో 65 సంవత్సరాల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.

జ్వరంతో బాధపడుతున్న అతడిని ప్రవేట్ ఆసుపత్రిలో పరీక్షించగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో కాకినాడలోని ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ఏడాది ఇదే మొదటి కేసు కావడం గమనార్హం. అలాగే ఇప్పటికే ఏపీలో వైజాగ్ అలాగే కడపలో నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి.