హరిహర వీర మల్లు ఓ ఫ్లాప్ సినిమా.. దీని కోసం ఇంతలా చేయాలా..? అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్ ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలను జైల్లో వేయిస్తామని తన మంత్రితో బెదిరిస్తారా..? అని మండిపడ్డారు. ఆ రోజు ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఇవి దివాలకోరు రాజకీయాలు కావా..? అని ఆగ్రహించారు.

సినిమా వాళ్లను బెదిరించటానికి మీరు ఎవరు..? అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలుసా మీకు..? అని నిప్పులు చెరిగారు పేర్ని నాని. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన కామెంట్స్ చేశారు. లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్ లోకి తెచ్చారు.. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో కసిరెడ్డిని తెచ్చారని వెల్లడించారు.