నైరుతి ఎఫెక్ట్ తో కేరళ, తమిళనాడు అతలాకుతలం అవుతున్నాయి. నైరుతి రుతు పవనాలకు తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యాయి. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు స్తంభించింది జనజీవనం.

నిన్న రాత్రి నుంచి కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.