ప‌రిటాల శ్రీరామ్‌… ఇలా అయితే ఫ్యూచ‌ర్ క‌ష్ట‌మేనా…!

-

ప‌రిటాల శ్రీరామ్‌. అనంత‌పురం జిల్లాలో యువ నాయ‌కుడిగా ఎద‌గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న ప‌రిటాల ర‌వి వారసుడు. అయితే, ఆదిలోనే ఆయ‌న అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. యువ నాయ‌కుడిగా అంద‌రినీ కలుపుకొని పోవాల్సిన శ్రీరామ్‌. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం రాప్తాడులో త‌న హ‌వా ప్ర‌దర్శిం చేందుకు శ్రీరామ్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక్క‌డ నుంచి త‌న వ‌ర్గాన్ని పెంచుకునేందుకు త‌న ప‌ట్టు పెంచుకునేందుకుకూడా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలో శ్రీరామ్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం తీవ్ర వివాదాల‌కు దారితీస్తోంది. ముఖ్యంగా సొంత పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది.

స్థానిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ నేత‌లు దూకుడుగానే ఉన్నారు. అయితే, శ్రీరామ్ ప‌రిస్థితి వేరు. ఆయ న ఇంకా ఎద‌గాల్సిన నాయ‌కుడు, ఎంతో భ‌విత‌వ్యం ఉన్న నాయ‌కుడు. కానీ, ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఆయ‌న ఇప్పుడే దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని సొంత పార్టీలోనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే పార్టీ నాయ‌కులు చెల్లాచెదురు అయిపోయార‌ని, ఈ క్ర‌మంలోనే ఉన్న నాయ‌కుల‌ను ఏక‌తాటిపై న‌డిపిస్తే.. శ్రీరామ్‌కు ఎదురు ఉండ‌ద‌ని చెబుతున్నారు. కానీ, ఆయ‌న అలా కాకుండా.. త‌న‌కంటూ ఓవ‌ర్గా న్ని ఏర్పా టు చేసుకుని ముందుకు సాగుతున్నాడ‌ని, సీనియ‌ర్ల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటు న్నారు.

పరిటాల శ్రీరామ్‌ గతంలో రామగిరిలోని వైఎస్సార్‌ విగ్రహాన్ని కూల్చేశామని, తాము అధికారంలోకి వస్తే 15 నిమిషాల్లోనే ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామని బాహాటంగా చెప్పడంపై నా టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇలాంటి రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం స‌మంజ‌సం కాద‌ని అంటున్నారు. గ‌తంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితులు నేడు లేవ‌ని అంటున్నారు. గ‌తంలో ఏం చేసినా అడిగేవారు కాద‌ని, కానీ.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనూ చైత‌న్యం వ‌చ్చింద‌ని, సో.. ప్ర‌జ‌ల మ‌న‌సెరిగి ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అంతేకాదు, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ప‌రాజ‌యాన్ని అంచ‌నావేసుకుని ముందుకు సాగాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. మ‌రి శ్రీరామ్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news