త్రివిక్రంతో బన్ని.. ఇక ఫిక్స్ అవ్వొచ్చా..!

-

నా పేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఓ పెద్ద కన్ ఫ్యూజన్ గా మారింది. విక్రం కుమార్ తో సినిమా ఉంటుందని అనుకోగా అది కాస్త అటకెక్కేసింది. అందుకే బన్ని చూపు త్రివిక్రం మీద పడ్డది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి.

అరవింద సమేత రిజల్ట్ ను బట్టి అల్లు అర్జున్ తన తర్వాత సినిమా త్రివిక్రం తో ప్లాన్ చేయాలని అనుకున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన అజ్ఞాతవాసి ఫ్లాప్ అవగా.. అరవింద సమేత రిజల్ట్ ను బట్టి డెశిషన్ తీసుకోవాలని అనుకున్నాడు. ఇక నిన్న వచ్చిన ఎన్.టి.ఆర్ అరవింద సమేత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

దసరాకి ఎప్పటిలానే ఎన్.టి.ఆర్ తన హంగామా కొనసాగిస్తున్నాడు. త్రివిక్రం ఎలాగు హిట్ కొట్టాడు కాబట్టి అతనితోనే తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట అల్లు అర్జున్. బన్ని త్రివిక్రం ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news