ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల ఎన్నికల ప్రక్రియను కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతుంది. దాదాపు ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసారు. ఆ తర్వాత అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించి అప్పుడు ఎన్నికలను కొనసాగించే ఆలోచన చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా రద్దు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికలలో అక్రమాలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి తోడు… రాష్ట్రంలో ఎకగ్రీవాలపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుంది. అదే విధంగా సుప్రీం కోర్ట్ ఎన్నికల కోడ్ ని సడలించాలి అని ఆదేశించిన సంగతి తెలిసిందే.
దీనితో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన ఎన్నికల సంఘం.. రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుంది. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలు కనపడుతున్నాయి. అటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా తరలించి అప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.