జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణ సస్పెండ్ అయ్యాడు. థియేటర్ బంద్ పిలుపు విషయంలో మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది అంటూ జనసేన పార్టీ పేర్కొంది.

అటు సినిమా థియేటర్ల వ్యవహారాలపై ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రజలు సినిమా థియేటర్లకు రావాలంటే తినుబండారాలు, శీతల పానీయాలు, వాటర్ బాటిల్స్ ధరలను నియంత్రించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో విడుదలయ్యే ఏ సినిమా అయినా, అది నా హరిహర వీరమల్లు అయినా సరే వ్యక్తిగతంగా నిర్మాత ఒకరు రావడం కాదు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.