2018-ముంబై దాడి కేసులో ప్రధాన సూత్రధారి,మాస్టర్‌మైండ్, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ కు యాంజియోప్లాస్టీ చికిత్స జరుగుతున్నట్లు పాకిస్థాన్ అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. లాహోర్‌లోని ఆస్పత్రిలో యాంజియోప్లాస్టీ కొనసాగుతున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 2008 ముంబై లో బాంబు దాడులు చోటుచేసుకోవడం తో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెలలో రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులలో 11 సంవత్సరాల జైలు శిక్ష విధించబడడం తో 70 ఏళ్ల హఫీజ్ సయూద్ ను జూలై 17 న అరెస్టు చేసి ఇక్కడి హై సెక్యూరిటీ కోట్ లఖ్‌పత్ జైలులో ఉంచారు. అయితే సయీద్ గురువారం ఛాతీ నొప్పితో ఫిర్యాదు చేయడం తో కోట్ లఖ్‌పత్ జైలు లాహోర్‌లోని వైద్యులు అతన్ని పరీక్షించి యాంజియోప్లాస్టీ నొప్పిగా పేర్కొన్నారు. వారు అతన్ని పంజాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ (పిఐసి) కి పంపడం తో, అక్కడ అతను యాంజియోప్లాస్టీ ప్రక్రియ చేయించుకున్నారు అని పంజాబ్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది అని,శనివారం సయూద్ ను జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడిని అధిక భద్రతతో ఆసుపత్రిలో ఉంచినట్లు తెలుస్తుంది.హఫీజ్ సయీద్‌ను టెర్రర్ ఫండింగ్ కేసుల్లో పాకిస్తాన్ కోర్టు దోషిగా తేల్చడం తో ప్రస్తుతం కోట్ లఖ్ పత్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా కూడా సయూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. సయూద్ పై 10 మిలియన్ల రివార్డ్ ను కూడా ప్రకటించింది.