కేసీఆర్ కుటుంబాన్ని గప్పా గప్పా గుద్ది, రప్పా రప్పా జైల్లో వేయాలి – ఎంపీ అరవింద్

-

తెలంగాణ రాష్ట్రంలో కూడా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా డైలాగ్ పాపులర్ అవుతోంది. మొన్నటి వరకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ కూటమి ప్రభుత్వం మధ్య కూడా రప్పా రప్పా అనే పుష్ప డైలాగ్ రచ్చ లేపింది. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ డైలాగ్ ను రాజకీయ నాయకులు ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు.

BJP-MP-Arvind-Dharmapuri-Telangana-CM-KCR-K-Chandrashekhar-Rao
BJP-MP-Arvind-Dharmapuri-Telangana-CM-KCR-K-Chandrashekhar-Rao

ముఖ్యంగా గులాబీ పార్టీ నేతల ఫ్లెక్సీ ల పై ఖచ్చితంగా పుష్ప 2 డైలాగు ఉంటుంది. అయితే ఈ డైలాగ్ పై తాజాగా నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు అరవింద్ స్పందించారు.

అల్లు అర్జున్ నటించిన పుష్ప లోని రప్పా రప్పా డైలాగ్ కొట్టి మరి వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కవిత అలాగే హరీష్ రావు లను గపా గపా గుద్ది… రప్పా రప్పా అనుకుంటూ జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు స్కామ్ చేశారని ఫైర్ అయ్యారు. అందుకే వాళ్ళని జైల్లో వేయాలని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బిజెపి ఎంపీ అరవింద్.

Read more RELATED
Recommended to you

Latest news