ఈమధ్య కాలంలో చాలా మంది జీవన శైలిలో మార్పులు చేసుకుని అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం లేదు. అయితే తీపి పదార్థాల విషయంలో చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకుంటున్నారు. కాకపోతే మరికొందరు బెల్లం ఆరోగ్యకరమా అనే సందేహంలో ఉన్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం బెల్లం ఆరోగ్యకరమే అని చెప్తున్నారు. కాకపోతే ఎటువంటి తీపి పదార్థాలు అయినా సరే సరైన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా బెల్లం తయారీలో తక్కువ ప్రాసెసింగ్ ఉండడం వలన దానిలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి కొన్ని పోషక గుణాలు ఉంటాయి.
కనుక ఆరోగ్యానికి బెల్లం మేలు చేస్తుంది. కాకపోతే సరైన విధంగా తయారు చేసిన బెల్లం మాత్రమే ఆరోగ్యకరం. కొన్ని రకాల బెల్లాలలో చెరుకు సాధ్యం ఎక్కువగా ఉంటుంది, దాని వలన అది ఆరోగ్యకరంగా భావించి తీసుకోవచ్చు. మరి కొన్ని బెల్లం రకాలు చక్కెరతో సమానంగా ఉంటాయి. అటువంటివి తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.కనుక వాటికి బదులుగా మాంక్ ఫ్రూట్, స్టీవియా, అల్లులోస్ వంటి సహజమైన చక్కరలను తీసుకోవచ్చు. వీటివలన రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా ఉంటుంది. కాకపోతే బెల్లం ను తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
కనుక మీ ఆరోగ్య పరిస్థితుల ప్రకారం ఈ తీపి పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా ఎటువంటి తీపి పదార్థమైనా సరే తక్కువ మోతాదులో తీసుకోవడం మేలు. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఎంతో జాగ్రత్త వహించాలి. చక్కెరను ఎక్కువ శాతం తీసుకోవడం వలన బరువు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కచ్చితంగా చక్కెర వినియోగాన్ని తగ్గించాలి.