రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా మూడు రోజులు వర్షాలు పడే ఛాన్సులు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.

ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో…. మూడు రోజులపాటు అంటే ఈనెల 29వ తేదీ వరకు… భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది తెలంగాణలోని ఉత్తర జిల్లాలలో… పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ.