సామాన్యులకు బిగ్ అలర్ట్. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ జూలై 1వ తేదీ నేపథ్యంలో… గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా వెల్లడించాయి. ప్రతి నెల సిలిండర్ ధరలను… మార్పులు చేస్తూ ఉంటాయి ఆయిల్ కంపెనీలు.

ఇందులో భాగంగానే ఈనెల ఒకటో తేదీ రాగానే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్ ధర 58.50 రూపాయల మేర తగ్గిస్తున్నట్లు తాజాగా వెల్లడించాయి ఆయిల్ కంపెనీలు. దీంతో ఢిల్లీలో ఒక సిలిండర్ ధర 1665 రూపాయలకు చేరింది. తగ్గించిన ధరలు ఇవాల్టి నుంచి అమలులోకి రాబోతున్నాయి. అదే సమయంలో గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. దీంతో సామాన్యులకు ఊరట లభించింది.