నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరుగనుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మొదటి రోజు ఎల్లమ్మ తల్లిని పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు ఆలయ అర్చకులు. మూడు రోజుల కళ్యాణ వేడుకలో భాగంగా రేపు రథోత్సవం ఉండనుంది.

ఈ తరుణంలోనే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రానున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. అమ్మవారి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.