తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలలో విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు సూచనలు జారీ చేశారు.

కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణ, కాకినాడ, ఏలూరు, కోనసీమ, గుంటూరు, ఎన్టీఆర్, ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. వర్షం ఎక్కువగా కురిసే సమయంలో పిడుగులు, ఉరుములు పడే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు.