ఏపీలో నేడు ప్రైవేట్ పాఠశాలలు బంద్ కానున్నాయి. ప్రైవేట్ పాఠశాలలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి ఏపీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాలు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని.. కేవలం తమ ఆవేదన తెలిపేందుకే అని స్పష్టం చేస్తున్నాయి ఏపీ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘాలు.
పాఠశాలలను షోకాజ్ నోటీసులతో వేధించడం, గుర్తింపు రద్దు చేస్తామని బెదిరించడం లాంటి చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరారు. మరోవైపు స్కూళ్లు ప్రారంభమై నెల రోజులు కూడా పూర్తికాకముందే ఇలా స్కూళ్లు బంద్ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.