తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ శాన్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉండొచ్చని తెలిపారు. ఉష్ణోగ్రతలు చాలా చోట్ల సాధారణం కంటే తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు ఈ నెలలో అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD తెలిపింది. వర్షంతో పాటు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.