కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డికాపూల్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి. దింతో ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం అధికారికంగా మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలు జరుగనున్నాయి.

జూలై 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య జయంతి నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖకు ఈ బాద్యతలు అప్పగించింది ప్రభుత్వం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా కలెక్టర్లు పాల్గొని రోశయ్య జయంతి నిర్వహించాలని, నివాళులు అర్పించాలని ఆదేశాలు జారీ చేసారు.
హైదరాబాద్ లక్డికాపూల్లో కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ రెడ్డి https://t.co/3o5rJLDuez pic.twitter.com/14hJ17GBGD
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025