తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం చేశారు. 15 మంది సభ్యులతో తెలంగాణ మీడియా కమిటీని నియమించారు. ఈ తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ చైర్మన్గా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డిని నియామకం చేసింది ప్రభుత్వం.

CO – చైర్మన్ గా ఎన్ టీవీ సీనియర్ రిపోర్టర్ చారిని నియామకం చేశారు. మెంబర్లుగా ఎల్వి వెంకట్ రామ్ రెడ్డి, బొడ్లపాటి పూర్ణచందర్రావు అలాగే పలువురు జర్నలిస్టులను నియామకం చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
- 15 మంది సభ్యులతో తెలంగాణ మీడియా అడ్వైజరీ కమిటీ నియామకం
- చైర్మన్గా న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
- కో చైర్మన్గా ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్
- మెంబర్లుగా ఎల్వీ వెంకట్ రామ్ రెడ్డి, బొడ్లపాటి పూర్ణచంద్రరావు మరియు పలువురు జర్నలిస్టుల నియామకం